
సీజన్ ఏదైనా సరే మహిళలు, పురుషులు ఎక్కువగా కంప్లైంట్ చేసే విషయాల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. జుట్టు రాలడం అనేది అందరిలోనూ ఉంటుంది. అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నామన్నది ముఖ్యం. జుట్టు ఊడుతున్న సమయంలో ముందులోనే జాగ్రత్తలు తీసుకోవాలి.

హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం జుట్టు రాలే సమస్యను తగ్గించి.. బలంగా ఉండేలా చేస్తుంది.

ఒక గాజు సీసా తీసుకోండి. అందులో వెల్లుల్లిని చిదిమి వేయండి. అందులో సగం వరకూ వాటర్ వేయాలి. ఈ సీసాను ఎండలో లేదా వెచ్చగా ఉండే ప్రదేశంలో రెండు రోజులు ఉంచాలి. ఆ తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఈ నీటిని తలస్నానం చేసే రెండు గంటల ముందు తలకు రాసుకోవాలి.

తల నుంచి వెల్లుల్లి వాసన వస్తుంది అనుకుంటే.. ఈ వెల్లుల్లి నీటిలోనే నిమ్మరసం పిండి తలకు అప్లై చేయండి. ఈ వెల్లుల్లి నీటిని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం, చికాకు, దురద వంటివి తగ్గుతాయి. పేలు ఉన్నా కూడా చనిపోతాయి.

ఇలా వారంలో రెండు సార్లు వెల్లుల్లి నీటిని తలకు రాసుకోండి. కొద్ది రోజుల్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఈ నీటిని ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా పోతుంది. జుట్టు సాఫ్ట్‌గా, ఒత్తుగా కనిపిస్తుంది.