Andhra Pradesh: ఆ ఊరిలో వినూత్న రీతిలో కొలువైన గణనాథుడు.. అందుకే ప్రతి వినాయక చవితీ వారికి చాలా స్పెషల్‌

| Edited By: Srilakshmi C

Sep 17, 2023 | 3:46 PM

సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ ఎంతోమంది వినాయక ..

1 / 5
కర్నూలు, సెప్టెంబర్ 17: సాధారణంగా వినాయక చవితి అంటే గణేషుడి విగ్రహాలదే అధికా ప్రధాన్యం ఉంటుంది. వివిధ రకాల గణపతులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది గతంలో లక్షలు ఖర్చు చేసి పీఓపీ విగ్రహాలనే కొనేవారు. ఇప్పటికే వాటికి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే.

2 / 5
ఎందుకంటే వివిధ రాకల డిజైన్లతో చూసేందుకు అందంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం పిఓపి విగ్రహాలకు దిటుగా మట్టి విగ్రహాలు కుడా చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లతో చేసి వెరైటీ మట్టి విగ్రహాలను చేస్తూ  ఎంతోమంది వినాయక మండపాల నిర్వహకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ వినాయక మండలి సభ్యులు..

3 / 5
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాధుని ప్రతిష్టిస్తారో ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురు  చూస్తూ ఉంటారు. కొండవీటి ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుండి వారు ప్రతిష్టించే గణనాథుడను ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ సంవత్సరం కూడా తులసీమాల, పువ్వు రుద్రాక్షలు, ఆముదాలు, కుసుమలతో  బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు గల 15 అడుగుల వినాయక విగ్రహం ను తయారు చేశారు. ఈ పూసలను భద్రాచలం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన పూసలతో ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.

4 / 5
ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి సంవత్సరం మట్టి గణనాధుని ఏర్పాటుచేసి తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు.

5 / 5
అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుండి తులసీమాల, పూర్ ద్రాక్షలు, ఆముదాలు, కుసుమలు, వంటి పూసలు తెప్పించి మట్టి గణపతిని 45 రోజులుగా శ్రమించి తయారు చేసినట్టు, ఈ గణనాధుని రూపం  విధానం కు రెండు లక్షల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు.