
ఆగష్టు 6వ తేదీన ఫ్రెండ్‌షిప్ రోజున మీరు మీ స్నేహితులకు వాస్తు ప్రకారం బహుమతులు ఇస్తే మీతోపాటు మీ స్నేహితుల జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ బహుమతులు జీవితాంతం ఇద్దరి లైఫ్‌లో అదృష్టాన్ని పెంచుతాయి. అలాగే మీ స్నేహా బంధాన్ని కూడా పెంచుతాయి. మరి ఆ బహుమతులు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం.

ఫ్రెండ్‌షిఫ్ డే రోజన క్రాసులా మొక్కను బహుమతిగా ఇవ్వడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను కుబేరుడికి ప్రతీకగా పేర్కొంటారు. దీనిని బహుమతిగా ఇవ్వడం వలన జీవితంలో ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది.

ఫ్రెండ్‌షిఫ్ డే రోజున గోమతీ చక్రాన్ని బహుమతిగా ఇవ్వడం బెటర్. గోమలి చక్రం ఎవరి ఇంట్లో ఉంటుందో వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మంచి ఆరోగ్యం ఉంటుంది. మీ స్నేహితుల పురోగతి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ఇవ్వొచ్చు.

ఫ్రెండ్‌షిఫ్ డే రోజన మీ స్నేహితునికి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది వారి జీవితంలో శుభ ఫలితాలను కలిగిస్తుంది. అదృష్టాన్ని కలుగజేస్తుంది.

వాస్తు ప్రకారం మట్టితో చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన అదృష్టం వరిస్తుంది. ఫ్రెండ్‌షిప్ డే రోజున మీ స్నేహితులకు బహుమతులు ఇవ్వాలనుకుంటే.. మట్టితో చేసిన వస్తువులను ఇవ్వొచ్చు. ఇది వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

స్నేహితుల దినోత్సవం రోజున మీరు మీ స్నేహితులకు వెండి బ్రాస్‌లెట్, ఏనుగు బొమ్మ, నాణెం ఇవ్వొచ్చు. వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వడం వలన ఇరువురిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తద్వారా ఇద్దరికీ ఆర్థిక లాభం కలుగుతుంది.