FPC ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుజరాత్ అసెంబ్లీ స్పీకర్, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌదరి మాట్లాడుతూ బనాస్ సేవ్ సాయిల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఇది స్థిరమైన భవిష్యత్తుకు పునాది వేస్తుందని తెలిపారు. ఇది నేల-క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రవీణ శ్రీధర్ అన్నారు. ఎఫ్‌పిసి ఏర్పాటుకు సన్నాహకంగా, థారాడ్, లఖానీ తాలూకాలలోని 40 గ్రామాల నుండి 14,492 మంది రైతులతో సేవ్ సాయిల్ బనాస్ బృందం ఒక్కటైంది.. అత్యాధునిక భూసార పరీక్షా ప్రయోగశాల.. జీవసంబంధ పరీక్షలను, సూక్ష్మజీవుల జీవితం, నేల ఆరోగ్యాన్ని హైలైట్ చేసే "సాయిల్ లైఫ్ రిపోర్ట్"ను అందిస్తోంది.