
Citrus Fruits- బత్తాయి,నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది.

Spicy Food- ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ తినడం వీలైనంత వరకు మానుకోవాలి. పరగడుపునే ఇలాంటి ఆహారాలను తినటం వల్ల అసిడిటి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Sugary Foods- ఉదయం పూట ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినడం మానేయడం మంచిది. ఇది మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. మీ ప్యాంక్రియాస్‌కు సమస్యలను కలిగిస్తుంది.

Aerated Drinks- ఉదయం పూట ఎరేటెడ్ శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది మీ జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. కడుపుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. శ్లేష్మ పొరను దెబ్బతీస్తుంది.

Raw Vegetables- ఖాళీ కడుపుతో పచ్చి కూరగాయలను తినడం మానుకోండి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అజీర్తిని కలిగిస్తుంది.

Cold Beverages- చల్లని జ్యూస్‌లు, ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలు ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఇలాంటి ఆహారాలను తినటం వల్ల శ్లేష్మ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.