
కట్ చేసిన యాపిల్స్ ముక్కలకు గాలి తాకినప్పుడు వాటికి ఆక్సీకరణం జరుగుతుంది. దీంతో యాపిల్స్ గోధుమ రంగులోకి మారుతాయి. అయితే ఇవి గోధుమ రంగులోకి మారకూడదంటే, ఒక బాక్స్‌లో నీరు పోసి అందులో రెండు చుక్కల నిమ్మరసం వేసి అదులో కట్ చేసిన యాపిల్స్ ముక్కలను నానబెట్టాలి. ఇలా చేయడం వలన ఆక్సీకరణ తగ్గి పండ్లు గోధుమ రంగులోకి మారకుండా ఉంటాయంట. అయితే కొంచెం టేస్ట్ మారతుందంట.

కట్ చేసిన యాపిల్స్ ముక్కలను సోడా నీరు లో నానబెట్టడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుందంట. సోడా నీటిలో కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది యాపిల్ పండ్ల ఆక్సీకరణను తగ్గిస్తుంది. దీంతో యాపిల్స్ ముక్కలు రంగు గోధమ రంగులోకి మారకుండా, కాయ కోసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందంట. దీని కోసం ఒక బౌల్‌లో సోడా నీ రు పోసి, అందులో ఐదు నిమిషాల పాటు యాపిల్ ముక్కలను ఉంచాలంట. తర్వాత వాటిని బయటకు తీస్తే ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

అదే విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీరు తీసుకోవాలి. వన్ స్పూన్ ఉప్పు వేసి, తర్వాత కట్ చేసిన యాపిల్స్ అందులో వేసి కొద్ది సేపు నాన బెట్టాలి. కనీసం పదినిమిషాలు సాల్ట్ వాటర్‌లో ఉండనివ్వాలంట. తర్వాత ఆ యాపిల్ ముక్కలను ఫ్రెష్‌గా నీటుగా, నార్మల్ వాటర్‌లో కడిగేసి బాక్స్‌లో పెట్టేసుకోవాలి. వాటి రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయంట.

అలాగే సాధారణ చల్లటి నీటిలో కూడా ఆపిల్ ముక్కలను కోసి నానబెట్టడం వలన కూడా యాపిల్ ముక్కలు ఫ్రెష్‌గా ఉంటాయంట. అంతే కాకుండా యాపిల్స్ కట్ చేసిన వెంటనే బాక్స్‌లో పెట్టి, గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టడం వలన కూడా యాపిల్స్ మక్కలు రంగు మారకుండా ఉంటాయంట.

ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. అగ్న్యాశయానికి (పాంక్రియాజ్) మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది. అందుకే త్వరగా ఆకలి వేయదు.