
మీన రాశి : జూన్ 7 కుజుడు, కేతువుల కలయిక వలన మీన రాశి వారు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోనున్నారంట. అంతే కాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. లేకపోతే నష్టం తప్పదంట. అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సమస్యలు తప్పవంట.

మేష రాశి : కుజ,కేతువుల కలయిక మేష రాశి వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుందంట. వీరు కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారంట. అంతే కాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు పని చేసే చోట ఎవరితో వాగ్వాదం పెట్టుకోకుండా ఉండాలంట లేకపోతే జాబ్ పోయే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు. అంతే కాకుండా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం అంట.

మిథున రాశి : ఈ రాశి వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావంట, వ్యాపారస్తులు చాలా నష్టాలు చూస్తారంట. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా జూన్ ఏడు నుంచి అస్సలే కలిసి రాదంట. అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలాగే విద్యార్థులకు కూడా ఇది ఘట్టు కాలమేనంట.

కర్కాటక రాశి : కుజ కేతువుల ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారంట. చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాదంట అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంట. అందుకే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ 7 నుంచి 51 రోజుల పాటు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని చెప్తున్నారు పండితులు. అంతే కాకుండా డబ్బు విషయంలో వీరు ఆచీ తూచి అడుగులు వేయాలంట.

కన్యా రాశి : ఈ రాశి వారికి సింహ రాశిలోకి కుజుడు, కేతువుల కలయిక వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అంతే కాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువు అవుతుంది. చాలా రకాలుగా సమస్యలు ఎదురు అవుతాయి. అందుకే ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలంట. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదంట.