
రోజూ వారి వంటల్లో ఉపయోగించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఇవి తప్పకుండా ఉంటాయి. మెంతులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెంతులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికే తెలుసుకున్నాం. కానీ వీటితో నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ ఆరోగ్యానికి మెంతులు ఎంతో హెల్ప్ చేస్తాయి. కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందట. మెంతులు ఎక్కువగా తీసుకుంటే ముఖంపై వాపులు వస్తాయట.

మెంతులు నానబెట్టిన నీటిని మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే వికారం, వాంతులు, తల నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొంత మందిలో అలర్జీ కూడా వస్తుందని తెలిపారు.

Fenugreek Seeds

మెంతుల్లో పోటాషియం లెవల్స్ అనేవి మెండుగా ఉంటాయి. దీంతో చాలా మంది మెంతులు తీసుకుంటారు. మరీ శృతి మించి వాడితే మాత్రం.. పోటాషియం లెవల్స్ తగ్గవచ్చని.. అందుకే సరైన పరిమాణంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.