
దీని కోసం ముందుగా మెంతి గింజలను సన్నని మంటపై తేలికగా వేయించాలి. వీటిని మెత్తని పౌడర్‌గా చేసుకుని పప్పు లేదా ఇతర వెజిటబుల్ కర్రీలలో కలపవచ్చు. మెంతి గింజల పొడి ఏ వంటలలోనైనా ఉపయోగించవచ్చు.

మెంతి గింజలు జుట్టు రాలడం, చుండ్రు వల్ల పొడిబారి నిర్జీవమైన జుట్టుకు ఇట్టే చికిత్స అందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగిన మెంతి గింజలను జుట్టుకు పోషనకు ఎలా వినియోగించాలంటే.. ముందుగా గుప్పెడు మెంతి గింజలను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే లేచి వడకట్టి తాగేయాలి. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఇంకా మంచిది. రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను సలాడ్లలో కూడా తినవచ్చు. అలాగే మెంతి గింజలను పప్పు, కూరగాయలలో కలిపి కూడా తినవచ్చు.

మెంతి గింజలు దట్టమైన, అందమైన జుట్టు అందించడంలో సహాయపడతాయి. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.. మెంతి గింజల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టుకు చాలా అవసరం. మెంతుల్లోని ఈ పోషకాలు జుట్టు సమస్యలను సులభంగా పరిష్కరించగలవు.

అలాగే.. 1/2 టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గేందుకు సహాయపడుతుంది.

Fenugreek water