
రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా కొంత మందికి ఉదయం లేచినప్పుడు ఉత్సాహంగా అనిపించదు. నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఇలా జరగడానికి పోషకాల లోపమని నిపుణులు అంటున్నారు. తరచూ ఇలా అలసిపోయినట్లు అనిపిస్తే ఏం చేయాలని అనిపించదు.

అలాంటి సమయాల్లో చాలా మంది నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయకుండా కొంచెం ఓపిక చేసుకుని శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బలహీనత మరింత పెరుగుతుంది.

ఇలాంటి సందర్భంలో మీరు ఓట్స్ తినవచ్చు. ఓట్స్ అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి మరియు శరీరాన్ని ఎక్కువ కాలం చురుగ్గా ఉంచుతాయి.

ఓట్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఓట్స్ తినడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు.

ఓట్స్‌లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి ఉంటాయి. ఇవి కండరాలు, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తద్వారా మానసిక, శారీరక అలసట తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.