అలసిన చేతులతో ఆనందంగా.. వెరైటీగా న్యూ ఇయర్ జరుపుకున్న కూలీలు!

Edited By:

Updated on: Jan 01, 2026 | 3:28 PM

వాళ్లంతా శ్రమజీవులు.. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని బడుగులు. వారంతా మట్టి వాసనతోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆధునిక యువతే కాదు నూతన సంవత్సరం సంబరాల్లో తాము తక్కువేమి కాదంటున్నారు. శ్రమతో అలసిన చేతులతో ఆనందంగా కొత్త సంవత్సర వేడుకలను శ్రమజీవులు ఎలా జరుపుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

1 / 5

2 / 5
        సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం దాచారం గ్రామంలోని శ్రమజీవులు కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వరి పొలంలో నాట్లు వేసిన అనంతరం శ్రమతో అలసిన చేతులతో ఆనందంగా కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. పచ్చని పొలాల మధ్య గట్లపై కూలీలు కొత్త సంవత్సరం వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. వరి పొలాల గట్లపై కొత్త సంవత్సరం సంబరాలు కేక్ కట్ చేసి కూల్ డ్రింక్స్ తో మహిళా కూలీలు చీర్స్ కొట్టారు.

3 / 5
తమ కూలీ మెస్త్రీ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి  కూల్ డ్రింక్స్‌తో చిన్నపాటి పార్టీ చేసుకుంటూ  అంబరాన్నంటేలా సంబరాలు చేశారు. కేవలం యువతకే పరిమితమని భావించే కేక్ కటింగ్ ట్రెండ్‌ను గ్రామీణ మహిళా కూలీలు కూడా అనుసరించి ఆనందం పంచుకుంటున్నారు.  పండుగలు, పబ్బాలు మాత్రమే కాదు శ్రమకు విలువ ఇచ్చే ప్రతి క్షణం వేడుకే అంటూ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

4 / 5
మట్టి వాసనతో నిండిన పొలాల్లో, చిరునవ్వుల కాంతితో నిండిన ముఖాల్లో కొత్త సంవత్సరం వేడుకలతో ఆనందాలు వెల్లివిరిశాయి. రోజంతా ఎండలో పనిచేసిన తర్వాత కలిసి కూర్చొని కేక్ కట్ చేయడం ఒకే కుటుంబ వాతావరణాన్ని తీసుకొచ్చిందని కూలీలు చెబుతున్నారు.

5 / 5
మా కష్టాన్ని వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. పచ్చని పొలాల నడుమ ప్రకృతి వడిలో ఆధునికతను మేళవించడంతో నూతన సంవత్సరం వేడుకలకు కొత్త నిర్వచనం ఇచ్చారు శ్రమజీవులు. ఈ సంబరాలు గ్రామీణ జీవనంలో మారుతున్న ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి.