
Eye Healtమీ కంటి చూపు తక్కువగా ఉండి, అద్దాలు పెట్టుకుంటే మీరు ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి. లేదంటే కంటి చూపులో మరింత సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే కళ్ల అద్దాలు పెట్టుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..h

మీరు అద్దాలు చేయించుకుంటున్నట్లయితే.. యూవీ రక్షిత అద్దాలను మాత్రమే తయారు చేయించుకోవాలి. ఇవి సూర్యుని నుంచి వెలువడే హానీకరమైన కిరణాల నుంచి మీ కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

చాలా మంది చెకప్ చేయించుకోకుండానే మునుపటి పవర్ పాయింట్స్‌తో కొత్త గ్లాసెస్ చేయించుకుంటారు. ఇలా చేయడం హానీకరం. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆ తరువాతే కొత్త అద్దాలు కొనుక్కోవాలి.

డబ్బులు ఆదా చేయడం కోసం చాలా మంది ప్రజలు ఐ చెకప్‌ను ఆప్టికల్ షాపుల్లోనే చెక్ చేసుకుంటారు. ఇది సరికాదు. ఆప్టికల్ షాపుల్లో ఐ సైట్ పవర్ సరిగా తేలదు. వీటి కారణంగా తలనొప్పి, అస్పష్టత, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్ వద్దకు వెళ్లి కంటి చెకప్ చేయించుకోవాలి.

కొంతమంది ఇతరుల కళ్లద్దాలను కూడా ఉపయోగిస్తారు. అయితే, ఇది సరికాదు. మీ కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది.

అద్దాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లెన్స్ క్లీనర్ సొల్యూషన్, మృదువైన క్లాత్‌ను ఉపయోగించాలి. తద్వారా కళ్లద్దాలకు మరకలు అంటవు.

కొంతమంది డబ్బులు ఆదా చేయడం కోసం తక్కువ నాణ్యత గల అద్దాలను కొనుగోలు చేస్తారు. ఇవి కళ్లపై దుష్ప్రభావం చూపుతాయి. తల నొప్పి వస్తుంది. ముక్కుపై మరక ఏర్పడి.. నొప్పి వస్తుంది. అద్దాలు కొనుగోలు చేసేముందు.. వాటి నాణ్యతను పరిశీలించాలి.