
డార్క్ చాక్లెట్స్ లో కోకో కంటెంట్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం 70 శాతం కోకో కంటెంట్ ఎక్కువ ఉండే డార్క్ చాక్లెట్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెం ట్లు కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.

డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగ నీస్..ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలను ఆరోగ్ గా ఉంచడంతో పాటుగా మంచి నిద్రకు దోహదం చేస్తాయి.

డార్క్ చాక్లెట్స్‌లోని ఫ్లేవనాయి హృదయ ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనా లు రక్తపోటును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్స్ తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇతర మెదడు సంబంధిత రుగ్మతల నుంచి కూడా రక్షణను అందిస్తుంది.