
జిమ్‌కి వెళ్లడం మంచి ఆరోగ్యానికి అవసరం. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అయితే మహిళలు కొన్ని ప్రత్యేక సమయాల్లో జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యా నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు 4 నుండి 5 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఈ సమయంలో రన్నింగ్, వాకింగ్ వంటి చూయడం కూడా కనిపిస్తుంది.

ఇది మాత్రమే కాదు వారు జిమ్‌లో బరువులు ఎత్తడం కూడా చేస్తారు. అయితే పీరియడ్స్ సమయంలో ఇలా చేయడం నిజంగా మంచిదేనా? అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది అసౌకర్యాన్ని అనుభవిస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పీరియడ్స్ సమయంలో మహిళలు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు ఎటువంటి అసౌకర్యం అనిపించకపోయినా ఈ సమయంలో శరీరం అనేక ప్రధాన మార్పుల ద్వారా వెళుతుంది. మీరు పీరియడ్స్ సమయంలో బరువులు ఎత్తితే అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇది ప్రేగులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

అలాంటి సందర్భంలో మీరు వీలైతే జిమ్‌కు వెళ్లకుండా ఉండాలి. తేలికపాటి యోగాసనాలు చేయడం మంచిదే. అయితే జిమ్‌కు వెళ్లి భారీ వ్యాయాయాలు చేయడం ప్రమాదకరం.