Ridge Gourd: వామ్మో బీరకాయ తినడం వల్ల బోలెడన్నీ బెనిఫిట్స్‌.. వదిలిపెట్టొద్దు!

Updated on: May 01, 2025 | 7:54 AM

మార్కెట్లో లభించే అనేక రకాల కూరగాల్లో బీరకాయ కూడా ఒకటి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, నీటి కంటెంట్, విటమిన్ బి6, విటమిన్ సి, కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్ మొదలైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి, బీరకాయను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరకాయ తినటం వల్ల బోలెడన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
Ridge Gourd

Ridge Gourd

2 / 5
శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ , కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపకరిస్తుంది.

3 / 5
బీరకాయను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. సెల్యులోజ్ మలబద్ధకాన్ని నివారించటంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, జింక్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థియామిన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

4 / 5
డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేయటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుంది. తద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కంటి ఆరోగ్యాన్ని రక్షించే బీటా కెరోటిన్ బీరకాయలో సమృద్ధిగా లభిస్తుంది. ఆకలి నియంత్రణలో ఉంచుతుంది. కామెర్ల సమస్యకు బీరకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది.

5 / 5
బీరకాయల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్‌, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. లివర్‌ను శుభ్ర పరుస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది. బీరకాయ తినటం వల్ల శరీరంలో అమ్లత్వాన్ని తగ్గించి.. వేడిని తొలగిస్తుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. అల్సర్ల సమస్య ఉన్నవారు బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచటంలోనూ బీరకాయ బెస్ట్‌ మెడిసిన్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.