
నాడు తుపాకీలు పట్టుకొని, అడవుల్లో ఉంటూ, పోరాటాలు చేసిన ఎంతో మంది మావోయిస్టులు ఇప్పుడు లొగిపోయి, ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నారు. అందులో ఈ మహిళా మావోయిస్టు కూడా ఒకరు. నాడు గన్ పట్టిన ఈమె నేడు చేతిలో నాగలి పట్టుకొని వ్యవసాయం పనులు చేస్తుంది. కాగా, ఈమె గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మొన్నటి వరకు అడవుల్లో ఆయుధాలు చేత బట్టుకొని తిరిగిన మాజీ మావోయిస్టులు.. లొంగిపోయిన తర్వాత..జన జీవన స్రవంతి లో కలిసి..వారికి నచ్చిన పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. AK -47 పట్టిన చేతులతోనే నేడు నాగలి పట్టి జీవనం కొనసాగిస్తుంది లొంగిపోయిన మహిళా మావోయిస్ట్ పోడియం లక్ష్మి. పేదలకు కోసం పోరాటాలు చేసి న్యాయం చేయాలనే ఉద్దేశంతో విప్లవ బాట పట్టి మావోయిస్టు పార్టీలో అనేక పోరాటాలు నిర్వహించింది.

తెలంగాణలో చివరిగా లొంగిపోయిన అనంతరం అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ, నాగలి పట్టి పోడు వ్యవసాయం చేస్తుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబాన్ని వదిలి ఎనిమిది సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాటం కొనసాగించింది.

భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన కమిటీ సభ్యురాలుగా చురుగ్గా పనిచేస్తూ పరిస్థితులు మారడంతో చివరగా తెలంగాణలో డీజీపీ ముందు లొంగిపోయారు. పేద ప్రజల సమస్యల కోసం ఆయుధం పట్టిన ఆమె ఇప్పుడు భుజాన నాగలి మోసుకెళ్తూ పొలం పనుల్లో నిమగ్నమై కుటుంబంలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది.

వివాహమైన రెండేళ్లకే తన భర్త కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు లక్షల రివార్డుతో పాటు ఇందిరమ్మ కేటాయిస్తే తన కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం కొనసాగిస్తానని అధికారులను వేడుకుంటుంది.