Longest Range EV Cars: పెట్రోల్ కార్లకు పోటీగా రోడ్లపై ఈవీ కార్ల రయ్..రయ్.. భారతదేశంలో అందుబాటులో టాప్ బెస్ట్ ఈవీ కార్లు ఇవే

|

Jun 08, 2023 | 4:00 PM

పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఉన్నత వర్గాల నుంచి పేద వర్గాల వరకూ ఈవీలపై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ఫోర్ వీలర్స్‌తో పోల్చుకుంటే టూ వీలర్స్ ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ అన్ని కంపెనీలు తమ స్కూటర్ మోడల్స్‌లో ఈవీలను పరిచయం చేశాయి. క్రమేపి ప్రముఖ కార్ల కంపెనీలు కూడా తమ కార్లల్లో ఈవీ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నాయి. నిర్వహణపరంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎక్కువ ఈవీ వాహనాల కొనుగోలు ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు ఈవీ వాహనాలపై వివిధ సబ్సిడీలను ఇస్తుంది. ఈ మధ్య కాలంలో కార్లల్లో ఈవీ మోడల్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. భారతదేశంలో రేంజ్‌పరంగా అందుబాటులో ఉన్న టాప్ క్లాస్ ఈవీలేంటో ఓ లుక్కేద్దాం.

1 / 5
టాటా నెక్సాన్ ఈవీ

ఈ కార్ చూడడానికి నార్మల్ నెక్సాన్ మాదిరిగా ఉన్నా సూపర్ పవర్ ప్యాక్ బ్యాటరీతో వస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన బ్యాటరీ కారణంగా ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 7.2 కేడబ్ల్యూఏసీ ఫాస్ట్ చార్జర్‌ను ఉపయోగించి ఏడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. నెక్సాన్ మ్యాక్స్ 50 కేడబ్ల్యూఏసీ చార్జర్‌ను ఉపయోగించితే గంటలోపే పూర్తిగా చార్జ్ చేసేయవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ ఈ కార్ చూడడానికి నార్మల్ నెక్సాన్ మాదిరిగా ఉన్నా సూపర్ పవర్ ప్యాక్ బ్యాటరీతో వస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన బ్యాటరీ కారణంగా ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 7.2 కేడబ్ల్యూఏసీ ఫాస్ట్ చార్జర్‌ను ఉపయోగించి ఏడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. నెక్సాన్ మ్యాక్స్ 50 కేడబ్ల్యూఏసీ చార్జర్‌ను ఉపయోగించితే గంటలోపే పూర్తిగా చార్జ్ చేసేయవచ్చు.

2 / 5
ఎంజీ జెడ్ఎస్ ఈవీ

ఎంజీ మోటార్స్ గతేడాది మార్చిలో రిలీజ్ చేసిన ఈ ఈవీ కార్ ఓ సారి చార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఐపీ 69 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వచ్చే ఈ కార్‌లో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇందులో సూపర్ మోటర్ కారణంలో కేవలం ఎనిమిది సెకండ్లల్లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎంజీ మోటార్స్ గతేడాది మార్చిలో రిలీజ్ చేసిన ఈ ఈవీ కార్ ఓ సారి చార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఐపీ 69 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వచ్చే ఈ కార్‌లో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇందులో సూపర్ మోటర్ కారణంలో కేవలం ఎనిమిది సెకండ్లల్లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.

3 / 5
హ్యూందాయ్ ఐయోనిక్ 5

ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. ఈ కార్‌లో వచ్చే 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా  ఓ సారి చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 350 కేడబ్ల్యూడీసీ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 10- 80 శాతం వరకూ చార్జ్ చేసేయవచ్చు.

హ్యూందాయ్ ఐయోనిక్ 5 ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. ఈ కార్‌లో వచ్చే 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఓ సారి చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 350 కేడబ్ల్యూడీసీ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 10- 80 శాతం వరకూ చార్జ్ చేసేయవచ్చు.

4 / 5
బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ

ఈ లగ్జరీ ఎస్‌యూవీ 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 857 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కార్‌కు వచ్చే డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం ముప్పై నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ అవుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటర్ 523 హెచ్‌పీ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ ఈ లగ్జరీ ఎస్‌యూవీ 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 857 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కార్‌కు వచ్చే డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం ముప్పై నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ అవుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటర్ 523 హెచ్‌పీ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

5 / 5
ఆడి ఈ ట్రాన్ జీటీ

ఈ ఎలక్ట్రిక్ కార్ స్టాండర్డ్ 93 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది. ఓ సారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 530 హెచ్‌పీ పవర్ అవుట్ ఈ కార్ ప్రత్యేకత. కేవలం 4.1 సెకన్లల్లో 0-100 స్పీడ్‌ను అందుకుంటుంది.

ఆడి ఈ ట్రాన్ జీటీ ఈ ఎలక్ట్రిక్ కార్ స్టాండర్డ్ 93 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది. ఓ సారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 530 హెచ్‌పీ పవర్ అవుట్ ఈ కార్ ప్రత్యేకత. కేవలం 4.1 సెకన్లల్లో 0-100 స్పీడ్‌ను అందుకుంటుంది.