
చర్మానికి ఏదైనా మేకప్ ప్రొడక్ట్స్‌ను అప్లై చేసే ముందు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.. లేదా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచే మేకప్ ఉత్పత్తులను అప్లై చేయండి. అలాగే, చర్మానికి మాయిశ్చరైజేషన్ చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంచి చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. చర్మాన్ని మెరిసేందుకు హెల్ప్ చేస్తుంది.

రెగ్యులర్‌గా ఫేస్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది. దీంతో రక్తప్రసరన పెరిగి, అందంగా కనిపిస్తారు. అలాగే, ముఖానికి ఆవిరి పట్టడం ద్వారా కూడా కొరియన్ గ్లాసీ స్కిన్ పొందొచ్చు. తరచూ ఆవిరి పట్టడం వల్ల చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలు తెరచుకుని మురికి, మలినాలని తగ్గిస్తుంది. స్టీమింగ్ తర్వాత చర్మాన్ని సర్కిల్ మోషన్‌లో 5 నుంచి 7 నిమిషాల పాటు మసాజ్ చేస్తే చాలా మంచిది.

అలాగే, చాలా మంది పింపుల్స్‌ను గిల్లుతూ ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. పింపుల్స్ అసలు చేతితో టచ్ చేయవద్దని చెబుతున్నారు. ముఖానికి క్రీం అప్లై చేసినప్పుడు గట్టిగా రుద్దడం వంటివి చేయకూడదని అంటున్నారు.. నెమ్మదిగా, సున్నితంగా రాయండి. ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది.

కొరియన్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఎక్కువగా డబుల్ క్లెన్సింగ్ ఫాలో అవుతారు. డబుల్ క్లెన్సింగ్ చేయడం వల్ల చర్మంపై మురికి సులభంగా తొలగిపోతుంది. కొరియన్ స్కిన్ కేర్‌లో ఇది చాలా కీలకమైనదిగా చెబుతున్నారు. ఇందులో చర్మం నుండి నూనె, మేకప్ పూర్తిగా తొలగించడానికి మీ ముఖాన్ని క్లీన్ చేయాలి.

కొరియన్ స్కిన్ కేర్ రొటీన్‌లో షీట్ మాస్క్‌లు అప్లై చేయడం అనేది కచ్చితంగా ఉంటుంది. షీట్ మాస్క్‌లు అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఫేస్ మాస్క్‌లు, షీట్ మాస్క్‌లు, స్లీవ్ మాస్క్‌లు కూడా చర్మాన్ని పోషణతో పాటు తేమగా ఉంచేలా హెల్ప్ చేస్తాయి. చార్‌కోల్ ఫేస్‌మాస్క్ వంటి వాటిని వాడడం వల్ల చర్మంలోని ట్యాక్సిన్స్ దూరమవుతాయి.