
మల బద్ధకం సమస్యలే కాదు.. చాలా మంది లూజ్ మోషన్స్‌తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. లూజ్ మోషన్స్ కారణంగా బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే భయంగా ఉంటుంది. వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు, పడని ఆహారాలు తిన్నా, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నా లూజ్ మోషన్స్ అవుతాయి.

లూజ్ మోషన్స్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా మళ్లీ మలబద్ధకం సమస్యల ఏర్పడుతుంది. అలా కాకుండా మన ఇంట్లో ఉండే నేచురల్ టిప్స్ పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

దాల్చిన చెక్కతో లూజ్ మోషన్స్‌ని కంట్రోల్ చేయవచ్చు. దాల్చిన చెక్క పొడిని ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణాశయంలో ఉండే ఇరిటేషన్ తగ్గిస్తుంది. గ్యాస్, ఇన్ఫెక్షన్ సమస్య తగ్గి.. మోషన్స్ కంట్రోల్ అవుతాయి.

అతిసారాన్ని కంట్రోల్ చేయడంలో జీలకర్ర కూడా ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో మరిగించిన జీలకర్ర తాగడం వల్ల కూడా మోషన్స్ కంట్రోల్ అవుతాయి. లవంగాలనే తిన్నా, పొడి రూపంలో తీసుకున్నా.. సమస్య అదుపులోకి వస్తుంది.

అల్లం, తేనె కలిపి తీసుకున్నా.. లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కడుపులో ఉండే గ్యాస్, అసిడిటీ సమస్య తగ్గుతుంది. తులసి ఆకుల నీటిని లేదా పుదీనా నీటిని తాగినా కూడా లూజ్ మోషన్స్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)