కాఫీ: చాలా మంది ఉదయాన్నే కాఫీ తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలోని కార్టిసాల్ లెవెల్స్ హార్మోన్ బ్యాలెన్స్‌పై దుష్ప్రభావం చూపుతంది. ఫలితంగా రక్తపోటు, మూడ్ స్వింగ్స్‌ని ఎదుర్కొవాల్సి వస్తుంది.
టీ: ఉదయాన్నే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఖాళీ కడుపుతో టీలోని చక్కెర, కెఫిన్, నికోటిన్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. టీ కారణంగా ఎసిడిటీ, గుండెల్లో మంట పెరుగుతాయి.
పండ్ల రసాలు: కొందరికి ఉదయాన్నే రుచికరమైన పండ్ల రసాలను తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ విధంగా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.
కార్న్ ఫ్లేక్స్: కొందరు బిజీబిజీ లైఫ్‌లో బ్రేక్ ఫాస్ట్‌ని కుక్ చేసుకునే తీరిక లేక కార్న్ ఫ్లేక్స్ వంటి రెడీమేడ్ ఫుడ్స్‌ని తీసుకుంటారు. అయితే ఇది ప్రాసెస్ చేసిన ఆహారం అయినందున ఫ్యాటీ లివర్, డయాబెటీస్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
పాన్‌కేక్: ఆకలిని నియంత్రించుకోవడానికి కొందరు ఉదయాన్నే పాన్‌కేక్‌లు తింటారు. దీన్ని ఖాళీ కడుపుతో తింటే రోజంతా ఆకలి కోరికలు పెరుగుతాయి. ఇంకా కడుపు నొప్పి అనిపిస్తుంది.