
ఇప్పటికే కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, గుడ్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గుడ్ల వల్ల ఎలర్జీ వస్తే బలవంతంగా గుడ్లు తినకూడదు. లేదంటే శారీరక సమస్యలు పెరుగుతాయి. రెగ్యులర్ వ్యాయామం చేసేవారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినవచ్చు. పచ్చసొన తినకపోవడమే మంచిది.

గుడ్లలో క్యాల్షియం, విటమిన్ బి2, బి12, ఎ, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే గుడ్డులోని పచ్చసొన వల్ల కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతుందని, ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది విశ్వసిస్తుంటారు.. అయితే, గుడ్డు పచ్చసొన నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదా? అంటే.. అవన్నీ అపోహలు మాత్రమేనంటూ పేర్కొంటున్నారు వైద్య నిపుణులు..

Eggs Benefits

గుడ్లలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్లను పోషకాల నిధి అంటారు. ఆరోగ్యవంతమైన ఎవరైనా రోజుకు 1-2 గుడ్లు తినవచ్చు. గుడ్లు తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

వారం మొత్తంలో 5-6 గుడ్ల కంటే ఎక్కువ గుడ్లు తినడం మంచిది కాదు..ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ కూడా పెరగవచ్చు. రోజుకు 2-3 గుడ్లు తినే వారు గుడ్డులోని పచ్చసొనను తినకుండా ఉండటం మంచిది. గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.