Curry Leaves: కరివేపాకుతో జుట్టు అందమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇలా పెంచుకోండి..

| Edited By: Ram Naramaneni

Jan 04, 2025 | 9:52 PM

కరివేపాకు కేవలం జుట్టు ఆరోగ్యం కోసమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కరివేపాకు ఉదయాన్నే నమిలి తింటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. బరువు తగ్గడంలో, డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో కూడా సహాయ పడుతుంది..

1 / 5
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించుకోవడానకి కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కరివేపాకుతో శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

2 / 5
ఉదయం పరగడుపున 4 లేదా 5 ఆకుల్ని నమిలి తిని ఆ తర్వాత ఓ గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కరివేపాకు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ఉదయం పరగడుపున 4 లేదా 5 ఆకుల్ని నమిలి తిని ఆ తర్వాత ఓ గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కరివేపాకు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

3 / 5
కరివేపాకు నమలడం వల్ల దుర్వాసన దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే.. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి.

కరివేపాకు నమలడం వల్ల దుర్వాసన దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే.. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి.

4 / 5
ఉదయాన్నే కరివేపాకులు నమలడం వల్ల శరీరంలో పేరుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. జీర్ణ సమస్యలు దూరమై జీవక్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో వెయిట్ లాస్ అవుతారు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కాలేయం, మూత్ర పిండాలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి.

5 / 5
కరివేపాకు తినడం వల్ల డయాబెటీస్‌ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే కరివేపాకు నమిలి తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కరివేపాకు తినడం వల్ల డయాబెటీస్‌ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే కరివేపాకు నమిలి తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)