
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

పెరుగులో చక్కెరను కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో చక్కెరను కలుపుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల జలుబు, ఫ్లూ, కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తర్వాత ఒక కప్పు పెరుగులో అర చెంచా చక్కెర కలిపి తినడం వల్ల అసిడిటీ సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.

పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల కడుపు మంట సమస్య వెంటనే తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పెరుగు, చక్కెర తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శారీరక బలం పెరుగుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారికి చక్కెర కలిపిన పెరుగు మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచూ తీసుకోవడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.