క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైడర్, మంచి కొవ్వులు, విటమిన్లు ఏ, కే వంటివి ఉంటాయి. అంతే కాకుండా క్యారెట్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. చలి కాలంలో ఆహారం అనేది త్వరగా జీర్ణం కాదు. క్యారెట్స్ తినడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే చర్మం కూడా తేమగా, పొడిబారకుండా ఉంటుంది.