- Telugu News Photo Gallery Eat these nuts to make your hair grow thick and long, check here is details in Telugu
Nuts for Hair: మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. సింపుల్‌గా ఈ నట్స్ తినేయండి!
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలని అందరూ అనుకుంటారు. జుట్టు వల్ల అందం కూడా రెట్టింపు అవుతుంది. అందరిలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. కేవలం ఆడవారికే కాదు.. మగవారికి కూడా జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు పెరగడానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇకపై అవేమీ అవసరం లేదు. సింపుల్‌గా ప్రతి రోజూ కొన్ని పదార్థాలను ప్రతి రోజూ తింటే చాలు. వీటి వల్ల మీ జుట్టు పెరగడమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. జుట్టు పొడుగ్గా పెరగడానికి ఏం తింటే..
Updated on: Jun 04, 2024 | 3:20 PM

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలని అందరూ అనుకుంటారు. జుట్టు వల్ల అందం కూడా రెట్టింపు అవుతుంది. అందరిలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. కేవలం ఆడవారికే కాదు.. మగవారికి కూడా జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు పెరగడానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇకపై అవేమీ అవసరం లేదు.

సింపుల్‌గా ప్రతి రోజూ కొన్ని పదార్థాలను ప్రతి రోజూ తింటే చాలు. వీటి వల్ల మీ జుట్టు పెరగడమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. జుట్టు పొడుగ్గా పెరగడానికి ఏం తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

జట్టు పెరగడానికి హెల్ప్ చేసే వాటిల్లో బాదం పప్పు కూడా ఒకటి. ప్రతి రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్, విటమిన్లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే జుట్టు బాగా పెరుగుతుంది.

వాల్ నట్స్ తినడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది. వీటిల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టు బాగా పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. పొద్దు తిరుగుడు గింజల్లో కూడా ఇవే పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం కూడా మంచిదే.

పల్లీలు తినడం వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గి.. బలంగా, దృఢంగా తయారవుతుంది. పల్లీల్లో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, రాగి వంటివి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చక్కగా సహాయ పడతాయి. ఖర్జూరాలు, చియా సీడ్స్ తీసుకోవడం కూడా బెటర్.




