Hair Growth: జుట్టు పెరుగుదల కోసం పరగడుపున ఇవి తింటే బెటర్..!

|

Mar 07, 2022 | 2:03 PM

Hair Growth: ఆధునిక కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు పరగడుపున ఈ ఆహారాలను తీసుకోవాలి.

1 / 5
కరివేపాకు: ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 3 నుంచి 4 ఆకులను నమలండి. కొన్ని రోజుల తర్వాత జుట్టులో తేడాను గమనిస్తారు.

2 / 5
అవిసె గింజలు: జుట్టుకు అవసరమైన ఒమేగా-3 అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఖాళీ కడుపుతో అవిసె గింజల పొడిని నీటితో తీసుకోవచ్చు.

3 / 5
వేప ఆకులు: సహజ ఔషధంగా పేరుగాంచిన వేప ఆకులు పొట్టకే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల వెంట్రుకలు పెరుగుతాయని చెబుతారు.

4 / 5
కొబ్బరి నీరు: ఇది ఆరోగ్యకరమైన పానీయం. ఇది ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, పొట్టను కాపాడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
సిట్రస్ పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉన్న సిట్రస్ పండ్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్ల రసాన్ని వారానికి మూడు సార్లు తీసుకోవాలి. అయితే మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటే అలా చేయడానికి నిపుణుల సలహా తీసుకోండి.