రేగు పండ్లు వచ్చేసాయ్‌..వీటిని తింటే కలిగే అద్భుత ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే..

|

Nov 30, 2024 | 4:09 PM

రేగు పండ్ల సీజన్‌ వచ్చేసింది... మార్కెట్లో రోడ్ల వెంట తోపుడు బండ్లపై రేగుపండ్లు ఊరిస్తున్నాయి. రేగి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ, సి, ఖనిజ పోషకాలు పుష్కలం. కండరాలు, నాడీ వ్యస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు అధికం. రేగి పండ్లలో ఉండే పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ రక్తహీనతను తగ్గిస్తుంది.

1 / 5
రేగి పండ్లలో ఉండే విటమిన్ సి జీవం కోల్పోయిన మేనిచాయను మెరుగుపరిచి, మెటిమలు లేని అందమైన చర్మాన్ని పెంపొందిస్తుంది. ఎండబెట్టిన రేగుపళ్లలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. రేగి పండ్లలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

2 / 5
మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. రేగిపండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్, పాలీశాకరైడ్స్, ప్లేవనాయిడ్స్, సపోనిన్స్ వంటివి నిద్రకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నందున రేగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. రోజువారీ ఆహారంలో రేగు పండ్లను చేర్చడం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు.

3 / 5
రేగు పండ్ల శోథ నిరోధక చర్య కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ నివారించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుంది.

4 / 5
రేగుపండ్లలో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఆకలిని అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి రేగుపండు సహాయపడుతుంది. రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి.

5 / 5
రేగుపండ్లను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రేగి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్తాయి. కాలేయం పని తీరు కూడా మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల కాన్సర్ కారకాలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని ఎన్నో గొప్పగుణాలు కాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా దూరం చేస్తాయి.