ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఆహారంలో కొవ్వును తగ్గించి, ప్రొటీన్ల తీసుకోవడం పెంచుతారు. ప్రొటీన్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుడ్లు, చీజ్‌లను రోజువారీ ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ప్రోటీన్లు పొందుకోవడచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇదే కాకుండా రకరకాల పోషకాలు కూడా ఉంటాయి. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక గుడ్డులో 24.5 mg కాల్షియం ఉంటుంది. అలాగే గుడ్డులో మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి.
అధిక మొత్తంలో ప్రోటీన్ పొందుకోవాలంటే చీజ్ తినవచ్చు. 40 గ్రాముల చీజ్‌లో తక్కువ కొవ్వు, 7.5 గ్రాముల ప్రోటీన్, కాల్షియం 190 మి.గ్రా ఉంటుంది.
గుడ్డు, చీజ్ ఈ రెండు ఆహారాలు చాలా పోషకమైనవి. బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండు ఆహారాలు తినవచ్చు.
మీ శరీరానికి అవసరమైన విటమిన్‌లు కూడా గుడ్డు, చీజ్‌లలో పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినని వారు చీజ్ కొంచెం ఎక్కువగా తింటే సరిపోతుంది. చీజ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నందున, బరువు తగ్గాలనుకునే వారికి గుడ్ల కంటే చీజ్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.