
యాలకుల్లో జింక్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే వాటిని ఎంతోమంది పర్సు, ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుంటారు.

జీర్ణక్రియ: ఎంతో మంది భోజనం చేసిన తర్వాత యాలకులను తింటారు. ఈ అలవాటు మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. దీనిలో ఉండే విటమిన్స్.. ఆహారం జీర్ణం కావడానికి ఎంతగానో సహాయపడతాయి. కడుపు ఉబ్బరం సమస్యలు కూడా తగ్గుతాయి.

నోటి దుర్వాసన: యాలకులు నోటి దుర్వాసనను పోగొడతాయి. ఎందుకంటే, వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెడు బ్యాక్టీరియాను చంపేస్తాయి. అంతేకాదు, ఇవి చిగుళ్ల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి.

గుండె ఆరోగ్యం: యాలకులు బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతాయి. హై బీపీ ఉన్నవాళ్లకు ఇవి బాగా పనిచేస్తాయి. అంతేకాదు, వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.

శ్వాసకోశ సమస్యలు: జలుబు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు యాలకులు తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఊపిరితిత్తులలో ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.