
నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా రోజూ తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడానికి, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Dry Fruits

ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినాలి. ఎండిన పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి. డ్రై ఫ్రూట్స్ ను మృదువుగా తింటే సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ సరైన సమయంలో తినాలి. ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో తినాలి. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ తినడం అంత మంచిదికాదు.

డ్రై ఫ్రూట్స్‌ని ఏ భోజనంలో అయినా కలిపి తినవచ్చు. అయితే పాలు, పాల ఉత్పత్తులతో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అంతమంచిది కాదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. పెరుగు నట్స్, డ్రైఫ్రూట్స్ లోని పోషక విలువలను తగ్గిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సమస్యలు తలెత్తుతాయి. కప్పు డ్రై ఫ్రూట్స్‌లో మూడో వంతు మాత్రమే తినాలి. ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను బాగా నమలాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ మొత్తంలో తినడం వల్ల పోషకాలు బాగా శోషించబడతాయి.