
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు చాలా అవసరం. అన్నింట్లో కంటే విటమిన్ బి12 శరీరానికి అత్యంత అవసరం. విటమిన్ బి12 నీటిలో కరిగే విటమిన్. శరీరంలో ఈ విటమిన్ తగ్గితే.. అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ వాటితో అవసరం లేకుండా ఈ డ్రింక్స్ తాగితే సరిపోతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ బి12ని భర్తీ చేయడంలో దానిమ్మ జ్యూస్ చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఓ గ్లాస్ దానిమ్మ రసం తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మెండుగా లభిస్తాయి. ఇది విటమిన్ బి12ని బూస్టింగ్ ఇస్తుంది.

వే ప్రోటీన్ షేక్‌లో కూడా విటమిన్ బి12 లభిస్తుంది. ఈ షేక్స్ వర్కౌట్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇది కండరాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. లస్సీలో కూడా మనకు విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఈ లస్సీలో ఇతర పండ్లు కూడా యాడ్ చేసుకుని తాగవచ్చు.

బాదం మిల్క్‌లో కూడా మనకు విటమిన్ బి12 దొరుకుతుంది. ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

అదే విధంగా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా విటమిన్ బి12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇతర ఆరోగ్య, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. మార్కెట్లో లభించే ఆరెంజ్ జ్యూస్ కంటే.. ఇంట్లో తయారు చేసుకోడం మంచిది.