
తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుంది.శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలు క్యాన్సర్ గ్రాహకాలుగా పని చేస్తాయి. పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల హార్మోన్లు సంతులనం చెంది ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా రొమ్ము క్యాన్సర్ భారం తప్పుతుంది.

బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల డీఎన్ఏ దెబ్బతిన్న రొమ్ము కణజాలు తొలగుతాయి. అందువల్ల క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.

బిడ్డను కన్న తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.

ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణం కార్సినోజెన్ల అభివృద్ధి చెందడమని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము కణజాలం బహిర్గతం కాకుండా ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

సాధారణంగా బిడ్డను కన్నతర్వాత ఆడవాళ్లు విపరీతంగా బరువు పెరుగుతారు. అయితే పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఊబకాయం సమస్య దూరం అవుతుంది. జీవ ప్రక్రియ సక్రమంగా సాగడం వల్ల బరువు నిర్వహణ బాగుంటుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.