
పురాతన కాలం నుంచి మెంతులు సుగంధ ద్రవ్యాలు, ఔషధ మూలికగా ఉపయోగించబడుతున్నాయి. వరుసగా 15 రోజులు నానబెట్టిన మెంతులు, దాని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

మెంతుల నీళ్లు పీరియడ్స్ సమయంలో వచ్చే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తాయి. మెంతులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తలనొప్పి, కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు పాలిచ్చే తల్లులకు కూడా ఎంతో మంచిది. అయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వీరు మెంతులు తినడం మంచిది.

నానబెట్టిన మెంతులు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. జీవక్రియను పెంచుతాయి. తద్వారా బరువు నియంత్రణలో సహాయపడతాయి. మెంతుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి. మొటిమలను తగ్గిస్తాయి. జుట్టు రాలడం,చుండ్రును తగ్గిస్తాయి. మెంతి గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

ఇది PCOS లో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే మెంతులు మహిళలు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

గమనిక: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.