- Telugu News Photo Gallery Do you suffer from back pain while driving? If you follow these tips, your journey will be comfortable.
డ్రైవింగ్ వేళ వెన్నునొప్పి వేధిస్తోందా.? ఈ చిట్కాలు పాటిస్తే.. ప్రయాణం హాయిగా..
ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చాలా మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడానికి ఇష్టపడతారు. ఇది ఖచ్చితంగా అందరికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం అనేది కొంచెం చికాకు కలిగించే పనే. శరీర నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి వేధిస్తుంటుంది. అందుకే డ్రైవింగ్ చేయడం ఎవరికైనా అలసటతో కూడుకున్న పని. చాలా సేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు.
Updated on: Oct 30, 2025 | 2:02 PM

ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చాలా మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తే శరీర నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి వేధిస్తుంటుంది. అందుకే డ్రైవింగ్ చేయడం ఎవరికైనా అలసటతో కూడుకున్న పని.

దీనికి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. మీరు డ్రైవింగ్ చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు. వెన్ను నొప్పి సమస్య ఉండదు. కాబట్టి ఈరోజు అలాంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

స్టీరింగ్ నుంచి సరైన దూరం ఉండాలి: సాధారణంగా కొంతమంది సీటుపై కూర్చున్నప్పుడు కొద్దిగా ముందుకు వంగి డ్రైవింగ్ చేస్తారు. దీని కారణంగా వారి చేతుల మధ్య సరైన గ్యాప్ ఏర్పడదు. దీంతో వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. అందుకే మీరు సౌకర్యవంతంమైన ఫీలింగ్ కలిగేవరకు మీ సీటును ముందుకు వెనుకకు కదపండి. ఎయిర్‌బ్యాగ్ పనిచేయాలంటే మీకు స్టీరింగ్ వీల్‌కు మధ్య కనీసం 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలని గుర్తుంచుకోండి.

సీటును ఎక్కువ వెనుకకు వంచవద్దు: కొంత మంది డ్రైవింగ్ సీటును చాలా వెనుకకు వంచి మరింత సౌకర్యంగా కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల సమస్యలు మొదలవుతాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 90° డిగ్రీల కోణం నుంచి ప్రారంభించి 10 నుంచి 20 డిగ్రీల కంటే ఎక్కువ వెనక్కి వెళ్లకూడదు.

సీటు ఎత్తు సర్దుబాటు చేయండి: డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పిని నివారించడానికి సౌకర్యవంతంగా ఉండటానికి మీ ఎత్తును కూడా సర్దుబాటు చేసుకోవాలి. మీ మోకాలు సీటు దిగువకు తగలకుండా చూసుకోండి. అలాగే సీటును చాలా ఎత్తుకు పెంచకండి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.




