Why Do You Soak Onions: ఉల్లిపాయలు కోసిన తర్వాత చల్లటి నీటిలో వేస్తారు..! ఎందుకో తెలుసా..

|

Jan 14, 2024 | 7:51 PM

ఉల్లిపాయలు లేకుండా ఏ వంట చేయలేమన్నది అందరికీ తెలిసిందే.! అలాగే, ఉల్లిపాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయలను వేసవిలో ఎక్కువగా తింటారు. ఉల్లిపాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు..ఉల్లిపాయల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇక ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. ఉల్లిని గ్రేవీగానీ, సలాడ్‌గానీ రకరకాలుగా ఉపయోగిస్తాం. అయితే, ఉల్లిపాయను కోసిన తర్వాత చల్లటి నీళ్లలో నానబెట్టడం మీరు చూసి ఉండాలి. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసా?

1 / 5
చాలా మంది ఉల్లిపాయలు దాని ఘాటు కారణంగా తినరు. ఉల్లిపాయ రుచిగా ఉంటుంది. కానీ, ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి నుండి వాసన వస్తుంది. మీరు గ్రిల్డ్ బర్గర్‌లు, సలాడ్‌లలో పచ్చి ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడితే, దాని ఘాటు లేదా వాసన కారణంగా తినకుండా పక్కన పెడుతుంటారు..ఇలాంటి సమయంలో మీకు సహాయపడే ఒక సులభమైన పరిష్కారం ఉంది..

2 / 5
మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయను ప్లేట్‌లో చేర్చే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉల్లిపాయాల్ని నానబెట్టండి. ఇది ఉల్లిపాయల కారాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయల ఘాటుకు సల్ఫర్ సమ్మేళనాలు కారణం.
చాలా మంది పొట్టను శుభ్రం చేయడానికి తీసుకుంటారు. అలాగే ఉల్లిపాయను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవాటి జుట్టు పెరుగుతుంది.

మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయను ప్లేట్‌లో చేర్చే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉల్లిపాయాల్ని నానబెట్టండి. ఇది ఉల్లిపాయల కారాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయల ఘాటుకు సల్ఫర్ సమ్మేళనాలు కారణం. చాలా మంది పొట్టను శుభ్రం చేయడానికి తీసుకుంటారు. అలాగే ఉల్లిపాయను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవాటి జుట్టు పెరుగుతుంది.

3 / 5
కేవలం పై తొక్క, ఉల్లిపాయ కొనలను కత్తిరించిన తర్వాత ఉల్లిపాయను చల్లటి నీటిలో నానబెట్టండి. ఉల్లిపాయను కనీసం 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత దానిని నీటి నుండి తొలగించండి. చల్లటి నీరు ఉల్లిపాయ తీక్షణతను తగ్గిస్తుంది. మీరు సువాసన కోసం నిమ్మరసంలో కూడా ఉల్లిపాయలను నానబెట్టుకోవచ్చు.

4 / 5
అలాగే,ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లు మండుతుంటే, ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే కన్నీటిని కలిగించే రసాయనం తొలగిపోయి ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్లు రావు.

5 / 5
పచ్చి ఉల్లిపాయ షుగర్‌ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.. పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్  అవుతుందని పరిశోధనల్లో తెలిసింది. అంతే కాదు, ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు