AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదివింది ఇంటర్.. కానీ ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. రామ్ చరణ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన నటి

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది నటీమణులు చదువును మధ్యలోనే ఆపేసి నటన వైపు అడుగులు వేశారు. అయినప్పటికీ తమ అద్భుతమైన నటన, అందం, టాలెంట్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఒకరు

Rajeev Rayala
|

Updated on: Nov 10, 2026 | 2:09 PM

Share
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది నటీమణులు చదువును మధ్యలోనే ఆపేసి నటన వైపు అడుగులు వేశారు. అయినప్పటికీ తమ అద్భుతమైన నటన, అందం, టాలెంట్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఒకరు. కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.

1 / 5
అలియా భట్ ప్రముఖ దర్శక నిర్మాత మహేశ్ భట్ కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. చదువుకంటే నటనకే ప్రాధాన్యత ఇచ్చింది. 2012లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
ముఖ్యంగా 'హైవే', 'రాజీ', 'గల్లీ బాయ్', 'గంగూబాయి కాఠియావాడి' వంటి సినిమాలు అలియా నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది అలియా. 

3 / 5
ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా అలియా భట్ బాగా పరిచయమే. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సీత పాత్రలో నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కనిపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో అలియాకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది కొంతసేపు మాత్రమే అయినా అద్భుతంగా నటించి మెప్పించింది. 

4 / 5
ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను అలియా భట్ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. సినిమాలు, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అలియా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. చిన్న వయసులోనే చదువుకు స్వస్తి చెప్పినా.. కష్టపడి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అలియా భట్ ప్రయాణం ఎంతోమందికి ఆసక్తికరంగా మారింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అలియా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us