
చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం కథ ప్రిపేర్ చేస్తే, మరొక హీరో చేయడం కామన్. అయితే ఓ యంగ్ హీరో సూపర్ హిట్ మూవీ వదులుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన న్యూస్ నెట్టి వైరల్ కావడంతో, అంత మంచి మూవీ ఎలా వదులుకున్నావంటూ, తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఏ హీరో, ఏ బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్నాడో చూసేద్దాం పదండి.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేశారంటూ.. అయితే అలానే ఓ కుర్ర హీరో బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్నాడంట. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా. జాతి రత్నాలు మూవీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా నటీనటులకు కూడా మంచి ఫేమ్ వచ్చింది.

అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో వీరందరికీ మంచి గుర్తింపు రావడమే కాకుండా, దీని తర్వాత అనేక అవకాశాలు తలుపు తట్టాయి.

అయితే ఈ సినిమాను ముందుగా దర్శకుడు నవీన్ పొలిశెట్టి కాకుండా, యంగ్ హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జాతో తీయాలి అనుకున్నాడంట. దీంతో ఒకరోజు మూవీ కథను తేజాకు వినిపించాడంట. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదంట. అలా ఈ సినిమా తేజా చేయాల్సింది ఉండగా, చివరకు నవీన్ పొలిశెట్టికి ఛాన్స్ వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

కాగా ఈ విషయాన్ని తేజా మిరాయి ప్రమోషన్స్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అలాగే తేజా మాట్లాడుతూ..ఈ మూవీ నవీన్‌కి వెళ్లడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమాకు 100 శాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడమే కాకుండా, బాగా నటించారని చెప్పుకొచ్చాడు.