Ultrasound: అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?

|

Oct 10, 2024 | 10:46 PM

కడుపులో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులు అల్ట్రా సౌండ్ స్కాన్‌ చేస్తారు. దీనివల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించవచ్చు. అంతేందుకు గర్భిణీలకు కూడా వైద్యులు తరచూ ఈ స్కాన్‌ చేస్తారు. దీంతో కడుపు లోపల బిడ్డ ఎలా ఉంది.? బిడ్డ అవయవాలు ఎలా ఉన్నాయి.? లాంటి వివరాలను ఫొటోల రూపంలో పొందొచ్చు. అయితే అల్ట్రా సౌండ్ చేసే ముందు కడుపుపై ఒక రకమైన జెల్‌ను అప్లై చేస్తారు. అది ఎందుకో తెలుసా.?

1 / 5
కడుపులో ఏదైనా సమస్య ఉంంటే వైద్యులు మొదట సూచించేది అల్ట్రాసౌండ్‌ లేదా సోనో గ్రఫీ స్కాన్‌. అయితే ఈ స్కాన్ చేసే సమయంలో చర్మంపై జెల్‌ను అప్లై చేయడాన్ని గమనించే ఉంటాం. ఇంతకీ ఈ జెల్‌ను ఎందుకు అప్లై చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.?

2 / 5
అల్ట్రాసౌండ్‌ అనేది శరీరం లోపల ఉండే భాగాలను స్పష్టంగా చూసేందుకు ఉపయోగించే మిషిన్‌. ఇందుకోసం సోనార్, రేడియో టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయితే ఈ స్కాన్‌ చేసే ముందు శరీరంపై అప్లై చేసే జెల్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

3 / 5
ఈ జెల్‌ అల్ట్రా స్కానర్‌లోని ట్రాన్స్‌డ్యూసర్ కదలడానికి ఉపయోగపడుతుంది. ఇది మిషిన్‌కు చర్మానికి మధ్య ఉన్న చిన్న గాలి కణాలను పూర్తిగా తొలగిస్తుంది. మిషిన్‌కు, శరీరానికి మధ్య గాలి ఉండడం వల్ల స్కాన్‌ సరిగ్గా జరగదు. అందుకే ఈ జెల్‌ను ఉపయోగిస్తారు.

4 / 5
ఈ జెల్‌ను నీరు, ప్రొపైలిన్‌ గ్లైకాలత్‌తో తయారు చేస్తారు. ఇది చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ పడకుండా చూస్తుంది. రేడియాలజిస్ట్‌ల ప్రకారం జెల్‌లో ఎలాంటి విషపూరితమైన పదార్థాలు ఉండదు. కేవలం గాలిని తొలగించడమే కాకుండా ట్రాన్స్‌డ్యూసర్ సెన్సార్‌ చర్మంపై సులభంగా కదిలేలా చేస్తుంది.

5 / 5
ఇంతకీ అల్ట్రాసౌండ్ ఎలా పనిచేస్తుందనేగా. ట్రాన్స్‌డ్యూసర్‌ సెన్సర్‌లోని తరంగాలు మొదట నేరుగా కడుపులోకి వెళ్తాయి. అనంతరం ఈ తరంగాలు నేరుగా శరీరంలోని కణజాలాన్ని తాకి, ప్రోబ్‌కి తిరిగి వస్తాయి. తరంగాలు తాకిన చోటు ఆధారంగా డిజిటల్ స్క్రీన్‌పై ఆ అవయవాల రూపంలో డిస్‌ప్లే అవుతాయి.