
పాలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వైద్యులు తప్పకుండా పాలు తాగాలని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే ఇష్టంగా పాలు తాగుతారు. మరికొందరికి పాలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు.

ఇక కొందరు ఉదయం పరగడుపున గ్లాస్ పాలు తాగితే, మరికొంత మంది మాత్రం రాత్రి సమయంలో నిద్రపోయే ముందు గ్లాస్ పాలు తాగి పడుకుంటారు. అయితే ఇలా రాత్రి సమయంలో పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే తప్పనిసరిగా నైట్ టైమ్ పాలు తాగాలంట.

రాత్రుళ్లు పాలు తాగడం వలన మంచిగా నిద్ర పోతారంట. పాలు మొలాటోనిన్ ఉత్పత్తి పెంచి నిద్రప్రేరేపిస్తాయంట. అందువలన రాత్రి సమయంలో పాలు తాగడం వలన ఎలాంటి ఆటంకం లేకుండా కంటినిండా నిద్రపోతారంట. దీని వలన ఆరోగ్యం కూడా బాగుంటుందంట. అలాగే డీ హైడ్రేషన్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే పాలల్లో ఉండే పోషకాలు, కాల్షియం, విటమిన్స్, ప్రొటిన్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయంట. అలాగే ఎముకలను దృఢంగా తయారు చేసి, కండరాలను వృద్ధి చేస్తాయంట. ముఖ్యంగా ప్రతి రోజూ పాలు తాగడం వలన ఎముకలు బలంగా తయారు అవుతాయంట. అలాగే వృద్యాప్యంలో వచ్చే కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయంట.

పాలల్లో విటమిన్ ఎ, విటమిన్ బీ 12, విటమిన్ డీ అనేవి పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని రోజూ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుందంట. అంతే కాకుండా రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వలన ఆకలి అనేది ఉండదు అంట. కడుపు నిండిన ఫీలింగ్ కలిగి కంటినిండా నిద్రపోతారంట.