
ప్రతి రోజూ పల్లీలు తినడం వల్ల మనకు కావాల్సిన ఫైబర్ పుష్కలంగా లభిస్తంఉది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పొట్ట నిండుగా ఉండే అనుభూతి కూడా కలుగుతుంది. ఇవే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

అంతేకాదు.. పల్లీలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాల నిధిగా చెబుతారు. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

వేరుశనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కండరాలు పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

వేరుశనగల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గుండె జబ్బులను నిరోధిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. పల్లీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3 మెదడు ఆరోగ్యానికి మంచిది. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలెన్నో అందుతాయి. పల్లీలను వేయించి తింటే కంటే ఉడికించి తినడమే మంచిది. పల్లీలను కొంచెం బెల్లం కలిపి తింటే పైత్యం చేయదు.