
సాధారణంగా ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగితే లాలాజలంలోని ఎంజైమ్స్ శరీరానికి మంచివని చెబుతారు. కానీ ఒకవేళ మీకు నోరు లేదా దంతాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దంత వ్యాధి, నోటి పూతలు, నోటి క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధులు ఉన్నప్పుడు నోటిలోని లాలాజలంలో హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగితే, ఆ హానికరమైన పదార్థాలు నీటితో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీళ్లు తాగే ముందు నోటిని బాగా కడుక్కోవాలి. నోరు శుభ్రం చేసుకున్న తర్వాత నోటిలోని బ్యాక్టీరియా, విషపదార్థాలు తొలగిపోతాయి. అప్పుడు నీళ్లు తాగడం సురక్షితం.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఉమ్మివేయడానికి బదులుగా లాలాజలం మింగడం మంచిది. ఎందుకంటే లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల అనవసరంగా లాలాజలం ఉమ్మివేయడం ఆరోగ్యానికి హానికరం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పెద్ద ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఖాళీ కడుపుతో సరిగ్గా నీళ్లు తాగడం మరియు నోటి పరిశుభ్రతను పాటించడం వల్ల మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.