
దక్షిణ భారత దేశం ప్రధాన వంటకం దోసెలు. దీనిని పిండిని పులియబెట్టి చేస్తుంటారు. అయితే దోసెలను ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి అంటే ముందుగా దోసె పిండిని తయారు చేసుకోవాలంట. కాగా దోసె పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.మూడు కప్పుల దోసె బియ్యం, ఇడ్లీ బియ్యం కూడా బాగా పని చేస్తాయి. అలాగే ఒక కప్పుడు మినపప్పు, వన్ టీ స్పూన్ మెంతులు, వన్ టీ స్పూన్ శనగపప్పు, గుప్పెడు పోహా, రుచికి సరిపడ ఉప్పు, అవసరమైనన్ని నీరు.

పిండి తయారీ విధానం : ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి. వాటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత అదే బౌల్‌లో సరిపడ నీళ్లు పోసి, బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత మినపప్పు, మెంతులు రెండు కలిపి వీటిని కూడా ఒక సారి నీటితో శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో పోహా నాన బెట్టుకోవాలి.వీటన్నింటిని నాలుగు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి.

తర్వాత మంచి గ్రైండర్ తీసుకొని, అందులో ముందుగా మినప్పు వేసి కొద్ది నీటితో మెత్త మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన కొద్ది దాని పరిమాణం రెట్టింపు అవ్వాలి. తర్వాత బియ్యం పోహా వేసి కొద్ది కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి. మొత్తం బియ్యం రుబ్బిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు,మెంతుల పేస్ట్ బియ్యం రుబ్బిన పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి.

ఇది ఎంత బాగా కలుపుకొని పులియ బెట్టుకుంటే అంత అద్భుతంగా దోసెలు వస్తుంటాయి. ఈ పిండిని మూత బెట్టి వెచ్చటి ప్రదేశంలో ఎనిమిది నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక శీతాకాంల, వర్షకాలంలో 14 నుంచి 16 గంటల వరకు నానబెట్టుకోవడం మంచిది. పిండి సరిగ్గా పులిగితే పిండి పరిమాణం రెట్టింపు అవుతుంది. పైన చిన్న బుడగల్లా కనిపిస్తుంటాయి.ఇప్పుడు కూడా పిండి మంచిగా పులిగిన తర్వాతనే ఉప్పు వేయాలి.

ఈ దోసె పిండిని ఐదు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చును. ఒక వేల పిండి చాలా పుల్లగా మారితే దాని సమతుల్యత కోసం కొద్దిగా బియ్యపు పిండిని కలిపితే రుచి సెట్ అవుద్దీ. ఈ పిండితో దోసెలు వేసుకుంటే అద్భుతంగా, హోటల్ స్టైల్‌లో బంగారు రంగులో వస్తాయి.