భారత సైన్యానికి పునాది 1 ఏప్రిల్ 1895న బ్రిటీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీచే వేయడం జరిగింది. దీన్ని అప్పుడు ప్రెసిడెన్సీ ఆర్మీగా పిలిచేవారు. తరువాత దీనిని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా మార్చారు. భారతదేశానికి స్వతంత్రం రాగానే భారత సైన్యంగా మారింది.
జనవరి 15, 1949 వరకు, సైన్యానికి కమాండర్ బ్రిటిష్ జనరల్ ఫ్రాన్సిస్ బుట్చేర్. స్వతంత్ర భారతదేశంలో, 15 జనవరి 1949న, భారత సైన్యం తన మొదటి భారత చీఫ్ జనరల్ KM కరియప్ప.అందుకే ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటారు.
ప్రస్తుతం భారత సాయుధ బలగాల్లో నియామకాల్లో లింగ వివక్ష లేదు. ఆయుధాలు,సేవల కోసం పురుష, మహిళా సైనికులను నియమిస్తున్నారు. భారత సైన్యం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కోసం 23 నవంబర్ 2021న జెండర్ న్యూట్రల్ కెరీర్ ప్రోగ్రెషన్ పాలసీని ప్రవేశపెట్టారు.
ప్రతి ఆరు నెలలకు, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 19 మంది మహిళా క్యాడెట్‌లను నియమిస్తారు. పర్మినెంట్ కమిషన్ తర్వాత, మహిళా అధికారులు భారత సైన్యంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటైన ఆర్టిలరీలో భాగమయ్యారు.
ఆర్మీ ఫిరంగిదళం యొక్క 300 రెజిమెంట్లు, సుమారు 5,000 మంది అధికారులు ఉన్నారు. బోఫోర్స్, హోవిట్జర్, కె-9 వజ్ర వంటి తుపాకీలపై ఫిరంగిదళంలో మహిళా అధికారులకు 2023లో అనుమతి.
మార్చి 17, 2023 నాటికి భారత సైన్యంలో మొత్తం 7,093 మంది మహిళలు. వీరిలో 100 మంది ఇతర ర్యాంక్ కేటగిరీలో ఉన్నారు. 6993 మంది మహిళలు ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మీ డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లతో అధికారులుగా నియామకం.