
డ్రై ఫ్రూట్స్‌లో బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండటం, అలాగే బలమై ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉండటం వలన బాదంపప్పును డ్రై ఫ్రూట్ రాజు అని పిలుస్తారు. బాదం పప్పును ఎక్కువగా, మిఠాయిలు, స్నాక్స్, సంప్రదాయ వైద్యం, ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. ఆరోగ్య, ఆహార పరిశ్రమలలో దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన బాదంపప్పుకు డ్రై ఫ్రూట్‌లో రాజు అని పేరు వచ్చిందంట.

బాదం పప్పుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. బాదం పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే బాదం పప్పుకు ప్రపంచ మార్కెట్‌లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాణిజ్య పరంగా, మార్కెట్ విలువ పరంగా, ఇది చాలా ఖరీదైనది. ఇక బాదం పోషకాహారం కోసం ఎక్కువగా తీసుకుంటారు. అదే వధంగా, స్వీ్ట్స్, బేకరీ ఉత్పత్తులు, పా ప్రత్యామ్నాయ ఆహారపదార్థాల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది.

ఇక బాదంపప్పు శాస్త్రీయ నామం విషయానికి వస్తే, దీనిని ప్రూనస్ డల్సిస్ అంటారు. ఇది రోసేసి కుటుంబానికి చెందినది. సమశీతోష్ణ, పాక్షిక శుష్క ప్రాంతాలలో బాదం పప్పును ఎక్కువగా పండిస్తారు. ఇక బాదం పప్పుల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ ఎక్కువగా ఉండటం, ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉండటం వలన మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి , బరువు నియంత్రణకు అద్భుతంగా పని చేస్తుంది.

ఇక బాదం పప్పును ఎక్కువగా ఎందులో ఉపయోగిస్తు్న్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బాదం పప్పును ప్రపంచ డ్రై ఫ్రూట్ పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్ రంగం, మిఠాయి తయారీ రంగం, నూనె వెలికితీత, ఎగుమతి మార్కెట్లలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా బాదం వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత జీవనోపాధికి , పండ్ల తోటల సాగు, బాదం పిండి, బాదం నూనె, బాదం వెన్న, బాదం పాలు వంటి ఆధారిత ఉత్పత్తి పరిశ్రమలకు ఇది మద్దతు ఇస్తుంది.

ప్రపంచంలోనే బాదం ఉత్పత్తి, బాదం సాగు ఎక్కడ ఎక్కువగా ఉన్నదంటే? భారత దేశంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, వంటి ప్రదేశాల్లో బాదం పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ఈ ప్రాంతాలు ఎక్కువ సమశీతోష్ణ పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అమెరికా ప్రపంచ వ్యాప్తంగా బాదం పప్పును ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. తర్వాత ఆసియా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి.