బంగారానికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పెరుగుతోన్న డిమాండ్‌కు అనుగుణంగానే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తులం బంగారం ధర రూ. 80 వేలు దాటేసింది. ఇంతకీ భూమిపైకి బంగారం ఎలా వచ్చిందనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా.?
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం భూమిపైకి పడ్డ ఉల్కలతో బంగారంపైకి వచ్చిందని చెబుతుంటారు. సుమారు 4 బిలియన్ ఏళ్ల క్రితం బంగారం, ప్లాటినం ఉల్కలతో భూమిపైకి వచ్చిందని చెబుతున్నారు.
చంద్రుడి పరిమాణంలో ఉన్న శకలాలు భూమిని ఢీకొన్న సమయంలో వీటితోపాటు అనేక ఇతర ఖనిజాలు కూడా వచ్చాయి. భూమి మొత్తం బరువులో 0.5 శాతం బంగారం ఈ తాకిడి వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం మనం ఉపయోగిసస్తున్న బంగారంలో 75 శాతం గత శతాబ్దం కాలంలో వెలికితీసిందే కావడం గమనార్హం. అయితే చంద్రుడు ఏర్పడిన తర్వాత భూమిపై ఇలాంటి వస్తువులు ఢీకొనడం చాలా తరచుగా జరుగుతోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
3.8 బిలియన్ ఏళ్ల క్రితం అకస్మాత్తుగా అంతరిక్ష కార్యకలాపాల్లో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఘర్షణలు ఆగిపోయాయని, దీంతో ఖనిజాలు భూమిపై పడడం ఆగిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.