Chinni Enni |
Dec 05, 2024 | 7:30 PM
జీవితంలో అప్పు చేయని వారు, అప్పులు లేకుండా ఎవరూ ఉండరు. ఎంత ఉన్నవారికైనా, లేనివారికైనా అప్పులు ఉండటం చాలా కామన్. ఎంత కష్ట పడినా అప్పులు తీరకపోవడం వల్ల, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అప్పుల బాధను తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.
అయితే కొంత మంది ఆర్థిక కారణాల వల్ల అప్పులు చేస్తూ ఉంటే.. మరికొంత మంది జల్సాలకు అలవాటు పడి కావాలని అప్పులు చేస్తారు. ఎంత కష్టపడినా అప్పల బాధ నుంచి బయట పడని వారు.. ఇలా చేస్తే ఆర్థిక బాధల నుంచి బయట పడొచ్చు.
అప్పుల బాధలతో బాధ పడేవారు.. ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీ దేవి ఆరాధన చాలా ముఖ్యం. ప్రతి రోజూ లక్ష్మీ దేవికి నేతితో దీపం పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయట పడతారు.
అదే విధంగా పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి.. ఆ లక్ష్మీ దేవికి మీ కోరికను చెప్పి ఆ కొబ్బరి కాయను నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలు త్వరగా తీరతాయి. ప్రతీ శుక్రవారం అమ్మవారికి మరిగించి చల్లార్చిన పాలను నైవేద్యంగా పెట్టినా మంచిదే.
ప్రతీ బుధవారం ఓ రెండు చిన్న ఖాళీ కుండలని తీసుకుని అందులో ముద్ద ఖర్పూరం వెలిగించి.. పారుతున్న నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయట పడతారని చెబుతూ ఉంటారు. ఇలా ఆరు వారాల పాటు చేయాలి.