Body Pains in Winter: శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..

|

Jan 11, 2025 | 12:57 PM

వింటర్ సీజన్ వచ్చిదంటే శరీరంలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. వీటి కారణంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పడుకున్నా.. కూర్చున్నా ఈ నొప్పులు వస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగని కారణంగా ఈ సమస్యలు వస్తాయి. ఇలా చేస్తే నొప్పులు రాకుండా ఉంటాయి..

1 / 5
శీతా కాలం వచ్చిందంటే శరీర నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారంటే మోకాళ్ల నొప్పులు మరింతగా వస్తాయి. చలి కారణంగా కండరాలు, కీళ్లు పట్టేస్తాయి. దీంతో ఎలాంటి పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.

2 / 5
వాతావరణంలో వేడి తగ్గడం కారణంగా శరీరంలో సిరలు కుంచించుకు పోతాయి. దీంతో రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. దీని వల్ల కండరాలు, కీళ్లు పట్టేసి.. నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ అనేది చాలా అవసరం.

3 / 5
అంతే కాకుండా విటమిన్ డి లోపం కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు అనేవి వస్తాయి. ఎందుకంటే వింటర్ సీజన్‌లో ఎండ అనేది చాలా తక్కువగా తగులుతుంది. దీని వల్ల కూడా శరీర నొప్పులు, మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి.

4 / 5
ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఉన్ని దుస్తులు, హీటింగ్ ప్యాడ్స్ వాడాలి. శరీరాన్ని వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి.. నొప్పులు రాకుండా ఉంటాయి.

5 / 5
నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తీసుకున్నా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. విటమిన్ డి ఉండే ఆహారాలు కూడా తినాలి. యోగా వంటివి చేయడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ చురుకుగా జరుగుతుంది.