
బరువు తగ్గాలనుకునే వారే కాదు.. బరువు పెరగాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. వయసుతో సంబంధం లేకుండా కొంత మంది చాలా సన్నగా ఉంటారు. ఒంట్లో అస్సలు సత్తువ ఉండదు. గట్టిగా ఓ ఐద కేజీల బరువు కూడా మోయలేరు. నీరసంగా ఉంటారు.

బరువు తగ్గాలని కొంత మంది తిప్పలు పడితే.. బక్కగా ఉన్నామని మరికొందరు బాధ పడుతూ ఉంటారు. నిజానికి ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం కూడా సమస్యే. బరువు పెరగడానికి ఎన్నో రకాల హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడే చూసేయండి.

ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. డ్రై ఫ్రూట్స్‌లో అన్నీ హెల్దీ ఫ్యాట్సే కాబట్టి.. బలంగా తయారవుతారు. డ్రై ఫ్రూట్స్ షేక్ కూడా తాగవచ్చు. కండరాలకు శక్తి కూడా అందుతుంది.

అరటి పండు ప్రతిరోజూ తిన్నా కూడా బరువు పెరుగుతారు. అందుకే చిన్న పిల్లకు రోజూ ఒక అరటి పండు ఇవ్వమని వైద్యులు చెబుతూ ఉంటారు. పీనట్ బటర్ కూడా ఆరోగ్యానికి మంచిదే. రోజూ బ్రెడ్ మీద ఈ బటర్ రాసి పిల్లలకు పెడితే పోషకాలు అందడంతో పాటు బరువు కూడా గెయిన్ అవుతారు.

అలాగే బెల్లం నీరు తాగినా, బెల్లం తిన్నా కూడా బరువు పెరిగేందుకు సహాయ పడతాయి. ఇందులో పోషకాలు కూడా చక్కగా శరీరానికి అందుతాయి. పెరుగు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకున్నా బరువు పెరిగేందుకు సహాయ పడతాయి.