పీరియడ్స్‌ టైమ్‌లో స్త్రీలు తాకిన పచ్చళ్లు పాడవుతాయా? నిజం ఏంటి?

Updated on: Jul 16, 2025 | 8:00 PM

మహిళల పీరియడ్స్ చుట్టూ ఉన్న అనేక నమ్మకాలను పూర్వకాలం నుంచి ఇప్పటివరకు పాటిస్తూనే వస్తున్నారు. ఋతుక్రమ సమయంలో స్త్రీలు చేయకూడని పనులు, చేయాల్సిన పనులు అంటూ ఓ జాబితా ఉంది. నెలసరి సమయంలో మహిళలు పచ్చళ్లు తాకితే పాడవుతాయని నమ్ముతారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటి.? ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.. 

1 / 5
మహిళల పీరియడ్స్ సమయంలో ఆహారాల విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తారు. అమ్మాయిలు నెలసరి సమయంలో ఊరగాయలను ముట్టుకుంటే ఊరగాయ చెడిపోతాయని అంటుంటారు. అయితే ఇవి తాకితే చెడిపోవడానికి బలమైన కారణం ఏమి కనిపించడం లేదు. 

2 / 5
పూర్వకాలంలో శుభ్రం చేయడానికి ప్రత్యేక పరికరాలు లేని కారణంగా స్త్రీలు కొన్నిరోజులు వంటగదికి దూరంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలో పరిశుభ్రత కోసం  చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని ఎటువంటి దృఢమైన ఆధారం లేని పనులను ఇప్పటికీ చేస్తున్నారు. 

3 / 5
ఊరగాయను ముట్టుకుంటే అందులో ఉన్నది మొత్తం చెడిపోతుందని చాలామంది స్త్రీలను ఇప్పటికీ కొపం చేస్తుంటారు. అప్పట్లో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అంత శుభ్రత లేదు. అలాగే అన్ని వైద్య సౌకర్యాలు కూడా లేవు.

4 / 5
పూర్వం ప్యాడ్లు వంటివి ఉండేవి కాదు. దీంతో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. జంతువుల నుండి కూడా ప్రమాదం ఉండేది.  రక్తం వాసనకు జంతువులు ఆకర్షితులయ్యేవి. అటువంటి పరిస్థితిలో వాటినుంచి రక్షణ కోసం మహిళలను ఇంట్లో ఒక మూలలో లేదా ప్రత్యేక గదిలో ఉంచేవారు.

5 / 5
కాలక్రమేణా ఈ సంప్రదాయం. ఋతుస్రావం సమయంలో స్త్రీలను 'అపవిత్రులు'గా పరిగణించడం ప్రారంభం అయింది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇది ఆ కాలపు అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని తెలుసుకోవచ్చు. 