పెళ్లి చేసుకుంటున్నా.. పన్ను కట్టాల్సిందేనా?

Updated on: Nov 21, 2025 | 3:27 PM

పన్ను కట్టడం అందరికీ తెలిసిందే. చాలా మంది ఇంటి పన్ను, ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఆదాయపు పన్ను కడుతుంటారు. అంతే తప్ప పన్ను చెల్లింపులు అనేవి ఎక్కువగా ఉండవు. కానీ ఇప్పుడు 2025లో వివాహం చేసుకునే జంటలు, వివాహ బహుమతి పన్ను కట్టాల్సిందేనా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అది ఏంటి? వివాహం చేసుకుంటే పన్ను కట్టడం అనుకుంటున్నారా? దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
జీవితంలో వివాహం అనేది ఒక పెద్ద ఘట్టం, ఇద్దరు వ్యక్తుల నూరేళ్లు జీవితం. ఇక వారి లైఫ్ చాలా ఆనందంగా గడిచిపోవాలి అని చాలా సంతోషంగా రెండు రోజుల పాటు, స్నేహితులు, బంధు మిత్రుల మధ్య ఘనంగా వివాహం జరుపుకుంటారు. ఇక పెళ్లి రోజు చాలా మంది విలువైన కానుకలు ఇస్తుంటారు. అయితే పరిమితికి మించి ఆదాయాలు, బహుమతులు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
చాలా వరకు పెళ్లి బహుమతులపై పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ 2025లో వివాహం చేసుకునే జంటలు తమ బహుమతులకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉంచుకోవాలి. అటువంటి సమయంలోనే మీరు పన్ను కట్టకుండా ఉండచ్చు, ఒక వేళ మీరు ఎలాంటి రుజువులు చూపించకుండా, వ్యక్తి బంధువు లేదా స్నేహితుల నుంచి 50.000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు పొందినట్లు అయితే పన్ను విధించడం ఖాయం అంటున్నారు నిపుణులు.

3 / 5
వివాహ బహుమతి పన్ను చట్టం ప్రకారం, దగ్గరి కుటుంబ సభ్యుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అందులో తల్లిదండ్రుల, అత్తమామలు, పిల్లలు, సోదరులు, సోదరీమణలు ఇలా వీరందరూ ఉంటారు.  ఇక కొంత మంది వివాహానికి ముందే బహుమతులను అందజేస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా సరైన పత్రాలు, ఫొటోలతో సహా రుజువు చేస్తే వీటికి కూడా పన్ను మినహాయింపు ఉంటుందంట.

4 / 5
వివాహం అయిన 11 నెలల తర్వాత ఇచ్చే వివాహ బహుమతులకు కూడా పన్ను మినహాయింపు ఉంటుందంట.  అయితే అన్నింటికీ మినహాయింపు ఉన్నప్పటికీ, పన్ను కార్యాలయం దానిని గుడ్డిగా అంగీకరించదు, వివాహానికి సంబంధించిన రుజువులు, బహుమతికి సంబంధించిన రుజువులు, క్లెయిమ్ మినహాయింపు, వివాహ కార్డు, అతిథిల జాబితా, బ్యాంకు రికార్డులు, బహుమతుల సందేశాలు చూపించే ఫొటోలు, వీడియోలు తప్పనిసరి అంట.

5 / 5
ఒక వేళా ఇలాంటి ఆధారాలు ఏవీ లేకుండా వివాహం సమయంలో చాలా విలువ చేసే బహుమతులు అందుకుంటే తప్పకుండా పన్ను కట్టాల్సిందేనంట. అంతే కాకుండా, బహుమతులు అందుకొని ,వాటిని మీరు  విక్రయించినప్పుడు పన్ను నియమాలు మారుతాయంట.